Tension At JC Prabhakar Reddy House: జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..! ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ఫైర్ .. - onstruction retaining wall Government College
Tension At JC Prabhakar Reddy House : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనాలోచిత కారణంగా ప్రజాధనం వృధాగా పోతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరనణం నెలకొంది. జేసీ ఇంటి ముందు ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి పనులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. జేసీబీతో పనులు చేస్తుండగా పైపులైన్ పగిలి పోయింది. తన ఇంటి ముందు 60 అడుగుల రోడ్డును వదిలి పనులు చేయాలని గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అయితే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనాలోచిత నిర్ణయాలతో పనులు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వారు ఎమ్మెల్యేపై మండిపడ్డారు. పోలీసులను పహారా పెట్టి రాత్రి సమయాల్లో కూడా జేసీబీలతో పనులు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.