'ఆడుదాం ఆంధ్రా'కు వ్యతిరేకంగా నిరసన - ప్రభుత్వం నోటిఫికేషన్ల గారడి చేస్తోందని ఆగ్రహం - గుంటూరులోని ఎంప్లాయిమెంట్ కార్యాలయం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 10:34 PM IST
Telugu Yuvatha Protest Against Aadudam Andhra: గుంటూరులోని ఎంప్లాయిమెంట్ కార్యాలయం వద్ద ఆడుదాం ఆంధ్ర పేరుతో తెలుగు యువత వినూత్న నిరసన చేపట్టింది. ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు ఆందోళన నిర్వహించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో, అడుగుదాం ఉద్యోగాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల సమయం వస్తుందని ప్రభుత్వం నోటిఫికేషన్ల గారడి చేస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగం లేదంటూ రోడ్డు మీదకు వచ్చి క్రికెట్ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దగా చేస్తున్నారని ప్లకార్డులను ప్రదర్శించారు. రోస్టర్ విధానాన్ని పటించుకోని నోటిఫికేషన్లు ఎందుకని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ ఎక్కడ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, జాబ్ క్యాలెండర్ లేదు. ఉద్యోగం లేదంటూ, రోడ్డుపై క్రికెట్ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు.