జగన్పై ధ్వజమెత్తిన నిరుద్యోగులు - చికెన్, మటన్ అమ్ముతూ వినూత్న నిరసన - Protests in AP AP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2024, 5:17 PM IST
Telugu Youth Leaders Protested Against CM Jagan:రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించకుండా సీఎం జగన్ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని తిరుపతిలో తెలుగు యువత నాయకులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా తిరుపతిలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని తెలుగు యువత ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం చాపలు, మటన్, చికెన్ విక్రయిస్తూ వినూత్నంగా నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని ఉన్నత చదువులు చదువుకున్న యువతకు ఉద్యోగులు కల్పించకుండా మద్యం, చికెన్, మటన్, చాపలు విక్రయించే ఉద్యోగాలు కల్పించారని విమర్శించారు. అలానే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఉద్యోగులతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రంలో ఒక్క కంపెనీ కూడా రాలేదు, నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.