TDP Anitha comments: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు.. నాలుగేళ్లలో 4వేల హత్యాచారాలు : అనిత - దళితులు
TDP Anitha comments: తనపై అనేక జుగుప్సాకరమైన రాతలు రాయిస్తోంది సీఎం జగన్ భార్య భారతియేనని, స్వయంగా సీఎం సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి కుమారుడు సజ్జలు భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో ఈ రాతలు రాయిస్తున్నారని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో అనిత మాట్లాడుతూ.. చదువుకున్న దళిత ఆడబిడ్డ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని తనకు అండగా నిలిచింది చంద్రబాబు అన్నారు. విమర్శించారు కదా అని.. ఇంట్లో కూర్చునే మనిషిని కాదని, పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మేం అడిగే ప్రశ్నలకు వైసీపీ నేతలు జవాబు చెప్పడం లేదన్న అనిత.. టీడీపీ, ఇతర పార్టీల మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఎప్పట్నుంచి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 4 వేల అత్యాచారాలు జరిగాయని.. న్యాయస్థానాలు సుమోటోగా తీసుకుని దర్యాప్తునకు ఆదేశించాల్సిందిగా అనిత కోరారు. మహిళలపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్య ప్రచారాన్ని రాష్ట్ర పోలీస్ డీజీపీని కలిసి ఫిర్యాదు చేద్దామంటే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని అనిత తెలిపారు.