ఆంధ్రప్రదేశ్

andhra pradesh

telugu_professional_wing

ETV Bharat / videos

ఏపీ ఉజ్వల భవిష్యత్తు కోసం లోకేశ్​ వెంట- యువగళంలో తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ హుషారు - Car rally from Hyderabad for Lokesh Padayatra

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2023, 6:28 PM IST

Updated : Dec 18, 2023, 7:24 AM IST

Telugu Professional Wing Supported Lokesh Padayatra:ఏపీలోనియువత ఉజ్వల భవిష్యత్తు కోసం లోకేశ్​ వెంట నడుస్తున్నామని ఐటీ ఉద్యోగులు తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న యువగళం పాదయాత్రకు హైదరాబాద్ నుంచి భారీగా తరలివచ్చిన తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ సంఘీభావం ప్రకటించింది. వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశమైందని ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. లోకేశ్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు రాష్టంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉండేవని కాని వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఐటీ ఉద్యోగులకు భవిష్యత్తు అనేది లేగుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఎన్నో ఐటీ కంపెనీలను తీసుకొచ్చి యువతకు మంచి భవిష్యత్తు చూపించిన లోకేశ్​కి మా మద్దతు ఇవ్వాలని అక్కడి నుంచి వచ్చాం అని తెలిపారు. యువగళం యాత్ర ప్రరంభమైన దగ్గర నుంచి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. కాని అవన్నీ ఎదుర్కొని యువతను కోసం వారి భవిష్యత్తు కోసం అరాచక శక్తులను ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి రావాలని ఐటీ ఉద్యోగులు అంటున్నారు. 

Last Updated : Dec 18, 2023, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details