TDP Political Action Committee Beeting: అధినేత అరెస్టైన చోటే రాజకీయ కార్యాచరణ కమిటీ సమావేశం..: టీడీపీ - Chandrababu case updates
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 29, 2023, 11:37 AM IST
Telugu Desam Political Action Committee Beeting:తెలుగుదేశం రాజకీయ కార్యాచరణ కమిటీ సమావేశం రేపు ఉదయం 11 గంటలకు నంద్యాలలో నిర్వహించనున్నారు. అధినేత చంద్రబాబుని నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన చోటే పీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. చంద్రబాబు అరెస్ట్, ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసుల నేపథ్యంలో.. చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై ఆ సమావేశంలో చర్చించనున్నారు. పీఏసీ ఏర్పాటైన తర్వాత జరగనున్న రెండో సమావేశం ఇది. లోకేశ్ దిల్లీ నుంచే వీడియో కాన్ఫరెన్స్ విధానంలో సమావేశంలో పాల్గొంటారని సమాచారం. మరోవైపు లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీ వాయిదా పడింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర ఆగిన చోటు నుంచే ఇవాళే మళ్లీ ప్రారంభించాలని మొదట నిర్ణయించారు. కానీ చంద్రబాబు అక్రమ అరెస్ట్, పార్టీ శ్రేణులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపుల నేపథ్యంలో యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీని వాయిదా వేసుకుని.. న్యాయవాదులతో సంప్రదిస్తూ న్యాయ పోరాటం చేయాలని లోకేష్‌ని పార్టీ ముఖ్య నేతలు కోరటంతో తాత్కాలికంగా వాయిదా వేశారు.