ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Kanna

ETV Bharat / videos

Kanna Fire on Jagan: ఓటమి భయంతోనే సీఎం జగన్ వ్యక్తిగత దూషణలు: టీడీపీ నేత కన్నా - TDP leader Kanna news

By

Published : Jul 22, 2023, 5:29 PM IST

TDP leader Kanna fire on CM Jagan: తెలుగుదేశం పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం కన్న తండ్రిని, తల్లిని, చెల్లిని వాడుకొని వదిలేసిన జగన్ రెడ్డి.. సిగ్గులేకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లపై ఎలా విమర్శలు చేస్తున్నావంటూ నిలదీశారు. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఉచ్ఛనీచాలు లేకుండా మాట్లాడటం జగన్‌కే చెల్లిందని దుయ్యబట్టారు.

జగన్.. కన్నవారినే వదిలేశారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై, పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''ఓటమి భయంతోనే సీఎం జగన్ వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. నాలుగేళ్లలో ఏం చేశారని.. ప్రజలను ఓట్లు అడుగుతారు జగన్. ఎన్నికల కోసం నువ్వెంత ఆత్రుత పడుతున్నావో.. నిన్ను (జగన్‌ను) సాగనపండానికి కూడా ప్రజలు అంతే ఆత్రుతగా ఉన్నారు. అధికారం కోసం కన్న తండ్రి పేరుని, తల్లిని, చెల్లిని వాడుకొని వదిలేసిన ఈ జగన్ రెడ్డి.. సిగ్గులేకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై దూషణలు చేస్తున్నాడు..?. ఈరోజు నీ పక్కన (జగన్) ఉన్నవారే గతంలో 'జగన్‌లాంటి వాడు నీ కొడుకుగా పుట్టాల్సిన వాడు కాదు.' అని మీ తండ్రి రాజశేఖర్ రెడ్డితో అనలేదా..?. వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి వెళ్లడం మాత్ర ఖాయం.'' అని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details