ఎన్నిక నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో మద్యం, డబ్బు రవాణాపై కట్టుదిట్టమైన నిఘా - andhrapradesh latest news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 2, 2023, 3:43 PM IST
Telangana, AP Inter Security Meeting in NTR District :ఎన్టీఆర్ జిల్లా భీమవరం టోల్ ప్లాజాలో తెలంగాణ, ఆంధ్ర ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. నవంబర్ 30న తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారుల సమన్వయ కమిటీ మీటింగ్ నిర్వహించారు. పరిమితికి మించి నగదు తీసుకెళ్లినా, మద్యం అక్రమ రవాణా చేసిన నిఘా ఏర్పాట్లు పటిష్టంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా సరిహద్దు ప్రాంతాలలో రౌడీషీటర్లు, అనుమానితులపై పోలీసుల నిఘా ఉంటుందని తెలిపారు.
Collectors Meeting on Telangana Border Security 2023 :ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన గరికపాడు చెక్ పోస్ట్ వద్ద అన్ని శాఖల అధికారులతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటైన మీటింగ్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, డీసీపీ వేజెండ్ల అజిత, సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాహుల్ సింగ్ సహా ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.