Teachers Unions Boycotted GAD Meeting in Vijayawada: జీపీఎస్‌పై సమావేశం.. బహిష్కరించిన ఉపాధ్యాయ సంఘాలు - సీఎం జగన్ హామీలపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2023, 4:37 PM IST
Teachers Unions Boycotted GAD Meeting in Vijayawada: జీపీఎస్ అమలు కోసం విజయవాడలో జీఏడీ సమావేశాన్ని నిర్వహిస్తుండగా.. ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించాయి. ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. సీపీఎస్ విధానానికి జీపీఎస్‌కు తమ మద్దతు ఉండదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం జీపీఎస్‌ను తీసుకురావటాన్ని వారు వ్యతిరేకించారు. ప్రభుత్వం మొండి వైఖరిని అనుసరిస్తోందని మండిపడ్డారు. సీపీఎస్ రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని పునురుద్దరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేగానీ ఇతర ప్రత్యమ్నాయాలను ఒప్పుకోవటం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఇచ్చిన హామీని నెరవేరుస్తారా లేదా అని ప్రశ్నించారు. జీపీఎస్‌లో ఉన్న అంశాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని కోరారు. రహస్యంగా సమావేశాన్ని నిర్వహించిన విధంగా అర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం యత్నిస్తోందని దుయ్యబట్టారు. అందుకోసమే ప్రభుత్వం నిర్వహించిన ఈ సమావేశాన్ని గతంలో మాదిరిగా బహిష్కరించినట్లు తెలిపారు.