ఆంధ్రప్రదేశ్

andhra pradesh

teachers_union_demand_to_cancel_cps

ETV Bharat / videos

Teachers Union Demand to Cancel CPS: 'సీపీఎస్ మాకొద్దు..' రద్దు చేసే వరకు పోరుబాట తప్పదంటూ ఉపాధ్యాయ సంఘాల హెచ్చరిక

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2023, 7:31 AM IST

Teachers Union Leaders Demand Cancellation of CPS:అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్​ రద్దు చేస్తానన్న హామీని ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా జీపీఎస్​ను అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరించారని.. వైసీపీ ప్రభుత్వం మాత్రం జీపిఎస్ మాత్రమే ఆదర్శమని చెబుతోందని ఇంతకంటే దారుణం మరొకటి ఉండదన్నారు. పది శాతం కంట్రీబ్యూషన్ కట్టించుకునే జీపీఎస్​ విధానం ఏ విధంగా మెరుగైనదో.. రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకువస్తున్న గ్యారంటీ పెన్షన్ విధానానికే గ్యారంటీ లేదని ఎద్దేవా చేశారు. జగన్​ ప్రతిపక్ష నాయకుడిగా సీపీఎస్​పై ఎన్నో బూటకపు హామీలు ఇచ్చారని కానీ, వాటిని గాలికి వదిలేశారని అన్నారు. ప్రభుత్వం సీపీఎస్​ను రద్దు చేయాలని, లేకపోతే మరోక బీఆర్టీఎస్ పోరాటం తప్పదని స్పష్టం చేశారు. ఎలాంటి పోరాటాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details