ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Teachers_Protest_Under_UTF_in_Konaseema_District

ETV Bharat / videos

యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆందోళన - ఉపాధ్యాయుల ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 2:53 PM IST

Teachers Protest Under UTF in Konaseema District: కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. 15 రోజులకు పైగా అంగన్వాడీ సిబ్బంది, వారం రోజులకు పైగా సర్వ శిక్షా అభియాన్ సిబ్బంది, మూడు రోజులుగా మున్సిపల్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాట పట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తుండగా ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పేరుతో నిరసన దీక్ష చేపట్టారు.

Teachers Demands: ఉద్యోగుల పీఎఫ్, పీఆర్సీ, ఇతర ఆర్థిక బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన గళం విప్పారు. సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు(Anganwadi Workers), సర్వ శిక్షా అభియాన్‌ ఉద్యోగులు(Sarva Shiksha Abhiyan Employees), పారిశుద్ధ్య కార్మికులు(Sanitation workers) అనేక విధాలుగా నిరసన చేస్తున్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కనీసం చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎవరిని కూడా చర్చలకు పిలిచే ప్రయత్నం కూడా చేయడం లేదని ఆక్షేపించారు. 

ABOUT THE AUTHOR

...view details