ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Teachers_Demand_To_Implement_Ops

ETV Bharat / videos

పండగ రోజు ఉపాధ్యాయుల వినూత్న నిరసన - సీపీఎస్​ రద్దు చేయాలని డిమాండ్ - ఉపాధ్యాయుల వినూత్న నిరసన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 15, 2024, 3:14 PM IST

Teachers Demand To Implement OPS: ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నమొండి వైఖరిని నిరసిస్తూ కడప కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. సంక్రాంతి సందర్భంగా ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తులు ధరించి గాలిపటాలు ఎగురవేశారు. ఒక్కో గాలిపటానికి ఒక్కో నినాదం కలిగిన ప్లకార్డును అతికించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఎన్నో హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నిర్లక్ష్య వైఖరికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

Teachers Protest in Cuddupah: జగన్ అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానం రద్దు చేస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు  రద్దు చేయకుండా ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. గత నాలుగేళ్ల నుంచి ఉద్యమాలు చేస్తున్నా ముఖ్యమంత్రి ఏమాత్రం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్​ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details