ఆంధ్రప్రదేశ్

andhra pradesh

nara_lokesh_interview_with_yadavs

ETV Bharat / videos

టీడీపీ అధికారంలోకి వచ్చాక యాదవులకు రాజకీయ అవకాశాలు, కమ్యూనిటీ భవనాలు : లోకేశ్ - Nara Lokesh comments

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 6:46 PM IST

TDP Youth Leader Nara Lokesh Interview With Yadavs: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యాదవులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ విద్యను అమలు చేస్తామని భరోసానిచ్చారు. దామాషా ప్రకారం యాదవులకు రాజకీయ అవకాశాలు, కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

Nara Lokesh Comments:యువనేత నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర శనివారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కోలహలంగా సాగుతోంది. 224వ రోజు (శనివారం) పాదయాత్రను ఆయన తిమ్మరాజుపేట క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, మహిళలు, ప్రజలు లోకేశ్‌కు దారిపొడవునా స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం జీవీఎంసీ 82వ వార్డులో యాదవులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పాలనలో యాదవులు  తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేతకు వివరించారు. 

యాదవులకు ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రం ఇచ్చింది ఎన్టీఆరే. యాదవులకు 90శాతం రాయితీతో పరికరాలు అందించాం. గొర్రెలు, మేకల కొనుగోలుకు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక యాదవులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ విద్యను అమలు చేస్తాం. దీంతోపాటు అన్నిచోట్లా కొత్త రోడ్లు వేస్తాం. దామాషా ప్రకారం యాదవులకు రాజకీయ అవకాశాలు, కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తాం. మన ప్రభుత్వం వచ్చాక గొర్రెలు చనిపోతే బీమా సొమ్ము కూడా అందిస్తాం. ఉత్తరాంధ్ర యాదవులను బీసీ-'బీ'లో చేర్చేందుకు కృషి చేస్తాం. - టీడీపీ యువనేత, నారా లోకేశ్

ABOUT THE AUTHOR

...view details