ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగన్‌ పాలనలో మహిళలపై దాడుల్ని నిరసిస్తూ.. మహిళా ఆత్మగౌరవ ర్యాలీ

ETV Bharat / videos

TDP womens rally: జగన్‌ పాలనలో దాడుల్ని నిరసిస్తూ.. మహిళా ఆత్మగౌరవ ర్యాలీ - Irregularities of YCP leaders against women in AP

By

Published : Jul 19, 2023, 9:10 PM IST

TDP women leaders rally: మహిళలపై అకృత్యాలు, దాడుల్ని నిరసిస్తూ.. తెలుగు మహిళలు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు, తెలుగుదేశం మహిళా శక్తి ఆధ్వర్వంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. జగన్ అధికారంలోకి వచ్చాక.. మహిళలపై దాడులు పెరిగాయని, బాలికలపై అత్యాచారాల్లో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో యువతులు,  బాలికలపై దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని మహిళా నేతలు ధ్వజమెత్తారు. మహిళలపై సామాజిక మాధ్యమాలలో.. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని తెలియజేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తిరుపతి.. రాష్ట్రంలో మహిళలపై దాడులకు నిరసనగా నిరసన కార్యక్రమం చేపట్టిన తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉషా, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో పాటు మరికొందరు మహిళలపై సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేయడంపై నిరసన తెలుపుతూ చక్రాల ఉషా శ్రీకాళహస్తిలోని పెండ్లి మండపం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని తెలియజేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ అంజు యాదవ్ చక్రాల ఉషాను అదుపులోకి తీసుకొని బలవంతంగా పోలీస్ స్టేషన్​కు తరలించారు. దీంతో పెండ్లి మండపం వద్ద కొంత అలజడి నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details