ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP_Village_President_Died_in_YCP_Leader_Attack

ETV Bharat / videos

TDP Village President Died in YCP Leader Attack: వైసీపీ నేత దాడిలో టీడీపీ గ్రామాధ్యక్షుడు మృతి.. గ్రామస్థుల ఆందోళనతో ఉద్రిక్తత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 7:50 PM IST

TDP Village President Died in YCP Leader Attack: వైసీపీ నేత దాడిలో గాయపడ్డ టీడీపీ గ్రామాధ్యక్షుడు మృతి చెందగా.. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. టీడీపీ నేత మృతిపై గ్రామ ప్రజలు ఏకమై వైసీపీ నేత ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు గ్రామస్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. న్యాయం జరిగే వరకు కదిలేదే లేదని గ్రామస్థులు.. వైసీపీ నేత ఇంటి వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు. 

అసలేం జరిగిందంటే:జిల్లాలోని రామచంద్రాపురం మండలం బొప్పరాజు పల్లె గ్రామానికి చెందిన మహ్మద్​ రఫీ.. టీడీపీ గ్రామ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు. అయితే అతని కుమారుడిపై వైసీపీ నేత సిద్దిక్ దుర్భాషలాడాడని.. వైసీపీ నేత సిద్దిక్​, మహ్మద్​ రఫీల మధ్య అక్టోబర్​ 5వ తేదీన వివాదం చేలరేగింది. ఈ వివాదం కాస్త దాడికి దారి తీసింది. సిద్దిక్​.. రఫీ తలపై కర్రతో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో గ్రామస్థులు రఫీని ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజుల చికిత్స అనంతరం రఫీ మంగళవారం మృతి చెందాడు. దీంతో గ్రామస్థులంతా ఏకమై.. రఫీ మృతదేహంతో సహా సిద్దిక్​ ఇంటిని చుట్టుముట్టారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు గ్రామస్ధుల మధ్య వివాదం జరగగా.. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రఫీ కుటుంబానికి న్యాయం చేయాలని అంతవరకు మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించేది లేదని గ్రామస్థులు భీష్మించుకూర్చున్నారు. 

ABOUT THE AUTHOR

...view details