TDP Tweet On Jagan CBI Cases: 20 క్రిమినల్ కేసుల్లో ఏ-1 జగన్ రెడ్డే.. టీడీపీ ట్వీట్ - వైఎస్ జగన్‌పై సీబీఐ కేసులు
TDP Tweet On CBI Cases List on YS Jagan Mohan Reddy: సీబీఐ కోర్టులో నేడు లిస్ట్ అయిన జగన్ కేసుల తాజా జాబితా అంటూ టీడీపీ ఫొటోలను ట్వీట్ చేసింది. 20 క్రిమినల్ కేసుల్లో ఏ-1 జగన్ రెడ్డే ఉన్నారని తెలిపింది. ఇటువంటి క్రిమినల్ పాలిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గర్వపడాలేమో అని ఎద్దేవా చేసింది. ఏది ఏమైనా దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా.. ఈ క్రిమినల్ రికార్డు అధిగమించాలంటే ఇప్పట్లో సాధ్యం కాదని ట్వీట్ చేసింది.
టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు విమర్శలు:వైఎస్జగన్ కేసులకు సంబంధించి.. టీడీపీ చేసిన ట్వీట్‌పై ఆ పార్టీ నేత నక్కా ఆనందబాబు స్పందించారు. జగన్‌కి సంబంధించి సీబీఐ కోర్టులో ఇవాళ 20 కేసులు లిస్ట్ చేసిందని తెలిపారు. జగన్ ఆస్తులన్నీ ఆటాచ్మెంట్లోనే ఉన్నాయని.. ఇలాంటి వ్యక్తి సీఎంగా ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంతా సిగ్గుపడాలని నక్కా ఆనంద్‌బాబు పేర్కొన్నారు. జగన్ కక్షపూరిత విధానాలు ప్రజలందరికి తెలిసిందే అని అన్నారు.