ఆంధ్రప్రదేశ్

andhra pradesh

votes_removed

ETV Bharat / videos

TDP Sympathizers Votes Target : 'టీడీపీ సానుభూతిపరులే టార్గెట్.. ఆ నియోజకవర్గంలో 24వేల ఓట్ల తొలగింపునకు వైసీపీ కుట్ర' - AP Latest News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2023, 3:15 PM IST

TDP Sympathizers Votes Target in Dharmavaram Constituency :ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్ల జాబితాలో అక్రమాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజవర్గంలో తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు వైసీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ధర్మవరంలో 24 వేల ఓట్ల తొలగింపుకు ఫారం 7 దరఖాస్తులు వైసీపీ ప్రజా ప్రతినిధి అందించారని ఆరోపించారు. ఫారం-7 ద్వారా గంపగుత్తగా 24 వేల 806 ఓట్ల తొలగింపునకు వైసీపీ ప్రతినిధి దరఖాస్తు చేసినట్లు ఆరోపించారు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, వివిధ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులు స్థానికంగా లేరనే నెపంతో సుమారు 18 వేల 515 ఓటర్లను తొలగించాలని వైసీపీ ప్రజాప్రతినిధి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమాలపై విచారణ చేయాలని ఆర్డీవో కార్యాలయంలో తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రతినిధి ఉన్నతాధికారులు, బీఎల్ఓలపైన ఒత్తిడి తెస్తుండటంతో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగింపునకు అధికారులు రంగం సిద్ధం చేశారని అన్నారు. ముఖ్యంగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధి అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details