ఆంధ్రప్రదేశ్

andhra pradesh

20026394_TDP_Supporters_Votes_Removed_in_Kothapeta_Constituency

ETV Bharat / videos

కొత్తపేట నియెజకవర్గంలో నాన్ లోకల్ పేరిట టీడీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపు - bandaru satyanarayana press meet

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2023, 12:24 PM IST

TDP Supporters Votes Removed in Kothapeta Constituency: ప్రజాస్వామ్య మనుగడకే కీలకమైన ఓటరు లిస్టును వైసీపీ నాయకులు భ్రష్టుపట్టిస్తున్నారని టీడీపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మండిపడ్డారు. నాన్ లోకల్ పేరుతో తెలుగుదేశం సానుభూతిపరులు ఓట్లు తొలగించేందుకు ఎన్నికల అధికారులు, వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని  బండారు పేర్కొన్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెంలో టీడీపీ కార్యాలయం వద్ద మంగళవారం నియోజవకర్గ నాయకులతో కలిసి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  నిబంధనలు పాటింకుండా ఓట్లు తొలగింపు దారుణమన్నారు. ప్రస్తుతం ఊర్లలో నివాసం ఉంటూ, పింఛన్‌ పొందుతున్న వారి ఓట్లను..నాన్‌లోకల్‌ పేరిట తొలగించేందుకు అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని తప్పుబట్టారు. ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లను తొలగించమంటే పట్టించుకోని అధికారులు.. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదు చేయగానే.. ఎటువంటి విచారణ జరపకుండా 3వేల మంది టీడీపీ సానుభూతిపరులకు నోటీసులు పంపడం ఏంటని అధికారుల్ని ప్రశ్నించారు. 

Deletion of Votes as Non Local: శాశ్వతంగా ఊరు విడిచి వెళ్లి పోయిన వారిని, డబుల్ ఎంట్రీలు ఉన్న వారిని నాన్ లోకల్ విధానం ద్వారా  తొలగించడం సహజం అని బండారు పేర్కొన్నారు. కాని జీవనోపాధి కోసం తాత్కాలికంగా బయటికి వెళ్లిన వారికి, చదువు నిమిత్తం వెళ్లి వారికి, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునేవారికి నోటీసులు జారీ చేయటం ఏంటని బండారు ప్రశ్నిస్తున్నారు. వీరితో పాటూ చివరికి ఊరులో ఉన్న వారికి, ప్రభుత్వ పథకాలు పొందుతున్న వారికి ప్రభుత్వం రూ. 45 స్పీడ్ పోస్టుకు ఖర్చు చేసి... నీ ఓటు ఎందుకు తొలగించకూడదు సమాధానం వచ్చి చెప్పాలని నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. పైగా నోటీసులు ఇంగ్లీషులో ఇస్తున్నారని సామాన్య మానవుడికి ఎలా అర్ధం అవుతుందన్నారు. కొత్తపేట నియోజకవర్గం ఓటరు జాబితాలో ఏ విధమైన తప్పిదాలు జరిగినా అధికారులే బాధ్యత వహించాలని బండారు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details