ఆంధ్రప్రదేశ్

andhra pradesh

tdp_state_president_atchannaidu_angry_on_cm_jagan

ETV Bharat / videos

TDP State President Atchannaidu Angry On CM Jagan: ఏపీ నీడ్స్ కాదు.. ఏపీ హేట్స్ జగన్.. వైసీపీ పాలన అంతం.. ప్రజల పంతం : అచ్చెన్నాయుడు - ap needs jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 4:33 PM IST

TDP State President Atchannaidu Angry On CM Jagan: బీసీల నోరు నొక్కడమే జగన్ రెడ్డి లక్ష్యమా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుపై వరుస కేసులు బనాయించిన బీసీల ద్రోహి జగన్ రెడ్డి అంటూ దుయ్యబట్టారు. బడుగు బలహీన వర్గాలపై అరాచకాన్ని సృష్టిస్తున్న జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. వరుస కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురి చేస్తూ జగన్మోహన్ రెడ్డి పెత్తందారి తనం మరొక సారి రుజువు చేసుకున్నారన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన తెలిపినందుకు కేసు పెట్టడం హేయమని మండిపడ్డారు.

 అన్ని కేసుల్లోనూ కాలవనే మొదటి ముద్దాయిగా చేర్చిన పోలీసులు, శాంతియుత నిరసనలపై పోలీసులు కావాలనే కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను రెండు గంటలపాటు ట్రాఫిక్ జామ్ చేసి మరీ చిందులేసిన వైసీపీ శ్రేణులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. చట్టం అందరికీ సమానమైనప్పుడు కేవలం ప్రతిపక్ష నాయకులపై కేసులెందుకు పెడుతున్నారని నిలదీశారు. ఆదివారం అర్ధరాత్రి రాయదుర్గం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న టీడీపీ దీక్షా శిబిరాన్ని బలవంతంగా ఖాళీ చేయించారన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా వెంటనే ముందస్తు అరెస్టులకు పాల్పడడం పోలీసులకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు.

చట్టాన్ని జగన్ రెడ్డి చుట్టంలా వాడుకుంటూ కొంత మంది పోలీసులను వైసీపీ ప్రైవేటు సైన్యంలా మార్చుకొని అరాచకానికి నాంది పలుకుతున్నారంటూ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే స్వేచ్ఛ లేదన్న అచ్చెన్న... ఆఖరికి బీసీలు గాలి పీల్చాలన్నా జగన్ రెడ్డి పర్మిషన్ కావాలంటారేమో అని మండిపడ్డారు. ఇంతటి నిరంకుశత్వ పాలనకు చరమ గీతం పాడే తరుణం ఆసన్నమైందన్నారు. జగన్ రెడ్డి అరాచకాన్ని బడుగు బలహీన వర్గాలు భరించలేకపోతున్నారన్నారు. ఏపీ నీడ్స్ జగన్ కాదు ఏపీ హేట్స్ జగన్ అని ప్రజలు పిలుపునిస్తున్నారంటూ విమర్శించారు. జగన్ రెడ్డికి జనానికి జరగబోవు ఎన్నికల కురుక్షేత్రంలో వైసీపీ పాలన అంతం.. ప్రజల పంతంగా సాగనుందని తెలిపారు. ఈ ఐదేళ్లు రాష్ట్రంలో ఒక చీకటి అధ్యాయంలా ముగిసిపోనుందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details