ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

ETV Bharat / videos

TDP protest on temple land lease: 'ఆలయ భూమిని కాజేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం' టీడీపీ ఆందోళన

By

Published : Jul 13, 2023, 5:13 PM IST

TDP protest on temple land lease : సాక్షి భవ నారాయణ స్వామి దేవస్థానం భూముల్ని కాజేసేందుకు దేవాదాయ శాఖ అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పథకం పన్నారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ ఆరోపించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి దేవాదాయ శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆటోనగర్ పేరుతో రైతులను మోసం చేసి దొంగ సంతకాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఆలయానికి చెందిన 9 ఎకరాల భూమిని కాజేసేందుకే ఎమ్మెల్యే తన భార్యను ట్రస్టు బోర్డు మెంబర్‌గా నియమించారని విమర్శించారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి రికార్డులను తారుమారు చేసి సొంత అవసరాలకు భూములను వాడుకోవాలని ప్రయత్నం చేశారన్నారు. ఈవో రమణమ్మ రైతులను మోసం చేసి సంతకాలు చేయించుకున్నట్లు స్పష్టమవుతుందన్నారు. అవినీతికి పాల్పడిన అధికారులను శిక్షించే వరకు పోరాటం కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్‌ తెలిపారు. స్థల వివాదం పై ఈవో రమణమ్మ మీడియాతో మాట్లాడుతూ 2025 వరకు రైతులకు పొలం చేసుకునే హక్కు ఉందని తెలిపారు. వారి ఇష్ట పూరితంగానే సంతకాలు చేశారే తప్ప ఎక్కడా ఒత్తిడి చేయలేదని వివరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఆలయానికి ఆదాయం వస్తుందని దుకాణ సముదాయానికి ప్రతిపాదన పంపినట్లు ఈవో వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details