ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు

ETV Bharat / videos

Kalava Srinivasulu on Jagan: లేపాక్షి నాలెడ్జ్​ హబ్​ భూముల కోసం జగన్​ ఎత్తులు: కాలవ శ్రీనివాసులు - టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు

By

Published : Jun 22, 2023, 7:15 PM IST

TDP Polit Bureau member Kalava Srinivasulu: తండ్రి అధికారంతో వేల కోట్ల విలువైన 8,864 ఎకరాల భూముల్ని లేపాక్షి నాలెడ్జ్ హబ్​కు కట్టబెట్టిన జగన్.. ఇప్పుడు వాటిని తనపరం చేసుకునేందుకు చూస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. అనంతపురం జిల్లాలో బడుగు బలహీన వర్గాల భూముల్ని రాజశేఖర్ రెడ్డి ఇందూ ప్రాజెక్ట్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ సంస్థలకు కట్టబెడితే, ఆ సంస్థల ద్వారా జగన్ తన కంపెనీల్లోకి నిధులు మళ్లించారని విమర్శించారు. అవే భూముల్ని బ్యాంకుల్లో తనఖా పెట్టిన ఇందూ ప్రాజెక్ట్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ సంస్థలు రూ.4631కోట్ల రుణం పొంది రైతుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. భూముల్లో ఎలాంటి పరిశ్రమలు పెట్టకుండా, రైతులకు న్యాయం చేయకుండా, వారి పిల్లలకు ఉపాధి చూపకుండా జగన్ సేవలో తరించాయని ధ్వజమెత్తారు. ఆ సంస్థలు చెల్లించాల్సిన రుణంలో రూ.500కోట్లు చెల్లించి, విలువైన భూముల్ని కొట్టేసేందుకు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడికి చెందిన ఎర్తిన్ సంస్థ ముందుకొచ్చిందని ఆరోపించారు. కేవలం 500కోట్లు చెల్లించి, 20వేలకోట్ల విలువైన భూముల్ని తనపరం చేసుకునేందుకు ముందుకొచ్చిన ఎర్తిన్ సంస్థ కోసం రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం చకచకా పని చేసిందని దుయ్యబట్టారు. రాత్రికి రాత్రే ప్రధాన విభాగాలన్నీ వాటివాటి పరిధిలోని ఫైళ్లను క్లియర్ చేయడానికి జగన్ ఆదేశాలతో పరుగులు పెట్టాయన్నారు. అదేవిధంగా రూ.5కోట్లు చెల్లించకుండా, 2,650ఎకరాల్ని ఢిల్లీ సంస్థకు కట్టబెట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. నాడు తండ్రి అధికారంతో కొట్టేసిన భూముల్ని, కంపెనీల ముసుగులో తిరిగి తనపరం చేసుకోవడానికి జగన్ వేసిన ఎత్తులు ప్రపంచంలో ఎవరూ వేయలేదని మండిపడ్డారు. 

ABOUT THE AUTHOR

...view details