ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP_petition_against_four_MLAs_joined_in_YSRCP

ETV Bharat / videos

ఆ నలుగురు ఎమ్మెల్యేలపై టీడీపీ అనర్హత పిటిషన్ - 'ఇప్పటికే వైఎస్సార్సీపీ ఫిర్యాదు' - టీడీపీ పిటిషన్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 9, 2024, 4:01 PM IST

TDP Petition Against Four MLAs Joined in YSRCP: పార్టీ మారిన నలుగురు తెలుగుదేశం ఎమ్మెల్యేలపై తెలుగుదేశం అనర్హత పిటిషన్ ఇవ్వనుంది. వైఎస్సార్సీపీలో చేరిన ఎమ్మెల్యేలు వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్​లపై వేటు వేయాలని పిటిషన్ వేయనుంది. నలుగురు ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీలో ఉన్నారనే అంశంపై ఆధారాలను టీడీపీ స్పీకరుకు ఇవ్వనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వీలైనంత త్వరగా నోటీసులివ్వాలని తెలుగుదేశం కోరనుంది. 

కాగా ఎన్నికల సమయం ముంచుకొస్తున్న సమయంలో నేతలు పార్టీలు మారుతున్నారు. అధికార వైఎస్సార్సీపీలో మార్పులు చేర్పులు, సీఎం జగన్ నియంతృత్వ ధోరణితో విసిగిపోయిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు వైఎస్సార్సీపీని వీడారు. వైఎస్సార్సీపీని వీడిన నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్, శాసన సభ ఛైర్మన్​కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. తాజాగా టీడీపీ కూడా పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్​ను వేసేందుకు సిద్ధమైంది. 

ABOUT THE AUTHOR

...view details