TDP Payyavula On Current Charges: 'జగన్ అవినీతి వల్లే రాష్ట్రంలో ప్రజలు విద్యుత్ భారం మోస్తున్నారు' - టీడీపీ పయ్యావుల కేశవ్ లేటెస్ట్ న్యూస్
TDP Payyavula on Rising electricity charges: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్లే రాష్ట్రంలో ప్రజలు విద్యుత్ భారం మోయాల్సి వస్తోందని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ లభిస్తున్నా, బయట నుంచి ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కమిషన్ల కోసం ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తూ ప్రజలపై ట్రూఅప్ ఛార్జీలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీంతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో నాసిరకం బొగ్గు వాడుతున్నారని ఆయన ఆరోపించారు. 2014-19 మధ్యకాలంలో టీడీపీ హయాంలో ఒక కుటుంబం చెల్లించిన విద్యుత్ బిల్లులు, వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ 4గేళ్ల పాలనలో చెల్లించిన బిల్లులు ఎంతో ప్రజల ముందు ఉంచాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. సామాన్యుడి నెత్తిన భారం తగించే చర్యలు మాని, భారం పెంచి, వ్యక్తిగత లబ్ది పొందే చర్యలకు పాల్పడ్డారని ఆయన దుయ్యబట్టారు.