TDP Pattabhi Ram on Sand Tenders: టెండర్లలో గోల్ మాల్.. ఇసుకాసురుడు కాజేసిన వేల కోట్లు కక్కించే వరకూ విశ్రమించం: పట్టాభిరామ్ - ఏపీలో ఆగని ఇసుక అక్రమ రవాణా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 29, 2023, 2:07 PM IST
TDP Pattabhi Ram on Sand Tenders :ఇసుక టెండర్లకు సంబంధించిన తేదీలు గతంలో అనేక సార్లు మార్చిన సీఎం జగన్ సర్కార్... కొత్తగా రేపటితో ముగియనున్న ప్రస్తుత టెండర్ దాఖలు గడువు తేదీని నవంబర్ 6వరకు ఎందుకు పొడిగించిందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. ఇసుక కాంట్రాక్ట్ టెండర్లలో కొత్తగా స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏర్పాటును అనుమతిస్తూ కొత్త నిబంధనను ఎందుకు తెరపైకి తెచ్చారో మంత్రి పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలన్నారు. రేపు ఇసుక టెండర్ దక్కించుకోనున్న సోదరుడు అనిల్ రెడ్డి అతని బినామీల కోరిక మేరకే జిల్లాల వారీగా ఇసుక తవ్వకాల సబ్ కాంట్రాక్ట్ లు అప్పగించడానికే ఈ ఎస్.పీ.వీ నిబంధనను తీసుకొచ్చారని ఆరోపించారు.
Kommareddy Pattabhiram Fire on Jagan about Sand Reaches Tender in AP :తాడేపల్లి ప్యాలెస్‌కు భారీగా ఇసుక దోపిడీ సొమ్ముని తరలించడానికే ఈ స్పెషల్ మనీ వెహికల్స్‌ను జగన్ రెడ్డి సిద్ధం చేశాడని పట్టాభి దుయ్యబట్టారు. రాష్ట్రంలో అత్యధిక ఇసుక రీచ్‌లు కలిగి ఉండి, ఎంతో విలువైన ప్యాకేజ్-2 రిజర్వ్ ప్రైస్ ను 740 కోట్ల రూపాయల నుంచి 691 కోట్ల రూపాయలకు ఎందుకు తగ్గించారో పెద్దిరెడ్డి జవాబు చెప్పాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించైనా సరే జగన్ రెడ్డి ఇసుక దోపిడీపై సీబీఐ విచారణ జరిపిస్తామని, ఇసుకాసురుడు కాజేసిన వేల కోట్లను కక్కిస్తామని పేర్కొన్నారు.