TDP on I-PAC వ్యతిరేకంగా ఉన్న ప్రజల ఓట్లను తొలగించేందుకే.. వ్యక్తిగత సమాచారం ఐప్యాక్‌కు చేరవేస్తున్నారు: టీడీపీ - నెల్లూరు జిల్లా లేటెస్ట్ న్యూస్
TDP Anam AP People data రాష్ట్రంలో నాలుగేళ్లుగా వాలంటీర్ల ద్వారా సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారం.. వైసీపీకు రాజకీయ సలహాలందించే ఐప్యాక్ గుప్పిట్లోకి చేరిందని, టీడీపీ ఆరోపించింది. ఏపీ ప్రజల వ్యక్తిగత సమచారం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐప్యాక్‌తో పాటు మరో 4 ప్రైవేటు సంస్థల వద్ద ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ డేటాకు ఐ-ప్యాక్‌తో సంబంధం ఏంటని నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు ఆనం వెంకట రమణారెడ్డి, విజయ్‌కుమార్.. ప్రశ్నించారు. ఆ కంపెనీలన్నీ నెట్‌వర్క్‌గా ఏర్పడి వైసీపీ కోసం పనిచేస్తున్నాయని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న ప్రజల ఓట్లను ఆ డేటా ఆధారంగానే.. తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఈ ధైర్యంతోనే సీఎం జగన్.. వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 సీట్స్ అని అంటున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. వాలంటీర్లంతా ప్రైవేటు సంస్థల నియంత్రణలో పనిచేస్తూ సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వైసీపీ కార్యకర్తలైన గృహసారథులకు రిపోర్ట్ చేస్తున్నారని వారు ఆరోపించారు. గృహసారథుల ద్వారా ఆ డేటా ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ(ఎఫ్ఓఏ)లకు వెళ్తోందని తెలుగు దేశం పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.