TDP Lokesh Tweet on AP Women: రాష్ట్రంలో పెరుగుతున్న మహిళల వ్యభిచారం, లైంగిక వేధింపుల గణంకాలపై లోకేశ్ ఆందోళన - నారా లోకేశ్ లేటెస్ట్ న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 3:20 PM IST
TDP Lokesh Tweet on AP Women: రాష్ట్రంలో మహిళలకు తగిన భద్రత, గౌరవప్రదమైన జీవితం అందించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యధిక శాతం మహిళలు.. లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయని ట్వీట్ చేశారు. ఏపీలో అత్యధిక మహిళలు పేదరికంతో వ్యభిచార కూపంలోకి దిగుతున్నారని, టీనేజ్లో గర్భం దాల్చినవారి సంఖ్య కూడా మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కాగా పోలీసులు మాత్రం మహిళల భద్రతను పట్టించుకోకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కే పనిలో నిమగ్నమయ్యారని లోకేశ్ మండిపడ్డారు. ఈ క్రమంలో 2021 నేషనల్ హెల్త్ సర్వే డేటా ట్వీట్ చేశారు. ఆ డేటా ప్రకాారం.. దేశ వ్యాప్తంగా 8 లక్షల 25 వేల మంది సెక్స్ వర్కర్లు ఉండగా.. ఒక్క ఏపీలోనే లక్షా 33 వేల మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు.