ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP_Nakka_Anand_babu_on_Chandrababu_Arrest

ETV Bharat / videos

TDP Nakka Anand babu on Chandrababu Arrest: 'డిజైన్ టెక్ ఎండీ వాస్తవాలు బయటపెడ్డడంతో సీఐడీకి ముచ్చెమటలు..' - చంద్రబాబు అరెస్టు లేటెస్ట్ అప్​డేట్స్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2023, 10:59 AM IST

TDP Nakka Anand babu on Chandrababu Arrest: వాస్తవాలు కప్పిపుచ్చి, చేసిన తప్పుని అడ్డగోలుగా సమర్థించుకోవడానికే సజ్జల, సీఐడీ చీఫ్ సంజయ్ మీడియా ముందు వక్రభాష్యాలు పలికారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. డిజైన్ టెక్ సంస్థ ఎండీ వికాస్ ఖన్వీల్కర్ వాస్తవాలు బయటపెట్టడంతో ప్రభుత్వం, సీఐడీకి ముచ్చెమటలు పట్టాయన్నారు. ఈడీ విచారణలో వాస్తవాలు చెప్పామని ఖన్వీల్కర్ చెప్పడం ప్రభుత్వానికి, సీఐడీకి మింగుడు పడలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు విషయంలో చేసిన తప్పులు.. ప్రజలకు తెలియకూడదనే నేడు.. సకల శాఖల సజ్జల, సీఐడీ చీఫ్ సంజయ్.. పాత కథనే కొత్తగా వల్లెవేసే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలకు ఏం చెప్పుకోవాలో తెలియకే తప్పుడు కేసుతో నిరాధార ఆరోపణలు చేసి చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపారని నక్కా ఆనంద్​ బాబు దుయ్యబట్టారు. వైసీపీ సర్కారుకొండను తవ్వి ఎలుక తోకలోని ఈకను పీకలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details