ఆంధ్రప్రదేశ్

andhra pradesh

tdp_mps_letters-_to_cbi_and_cvc

ETV Bharat / videos

TDP MPs Letters to CBI and CVC: ఏపీలో ఇసుక తవ్వకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎంపీలు కనకమేడల, కింజరాపు లేఖ - సీబీఐ సీవీసీలను టీడీపీ లేఖ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2023, 4:06 PM IST

Updated : Oct 29, 2023, 4:32 PM IST

TDP MPs Letters  to CBI and CVC:ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ.. సీబీఐ, సెంట్రల్​ విజిలెన్స్​ కమిషన్​లకు టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్​మోహన్ నాయుడు, కనకమేడల లేఖలు రాశారు. ఎంఎస్​టీసీ వేదికగా ఇసుక అక్రమాలకు ఏపీ ప్రభుత్వం తెర లేపిందని ఎంపీలు లేఖల్లో పేర్కొన్నారు. ఎన్జీటీ నిబంధనలకు విరుద్దంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు లేఖలో ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ పెద్దల బినామీలకే దక్కేలా టెండర్లను రూపొందించారని ఆక్షేపించారు. గతంతో పోల్చుకుంటే సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని చాలా వరకు తగ్గించారని లేఖలో ఎంపీలు వివరించారు. 

నాన్ రిఫండబుల్ టెండర్ డాక్యుమెంట్ ధరను.. ఏకంగా 29.50 లక్షల రూపాయలు మేర వసూలు చేయడం ద్వారా పోటీని తగ్గించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ప్రీ-బిడ్ మీటింగ్ ఏపీలో కాకుండా రహస్యంగా కోల్​కత్తాలో నిర్వహించారని సీబీఐ, సీవీసీలకు ఎంపీలు లేఖ ద్వారా వివరించారు. ఆరోపణలు వస్తే వాటిని ఎంఎస్​టీసీ మీదకు నెట్టేసే విధంగా.. పక్కా ప్రణాళికతో ఇసుక దోపిడీకి తెర లేపారని ఆరోపించారు. ఏపీలోని ఇసుక దోపిడీ కోసం జరుగుతున్న టెండర్ల ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని సీబీఐ, సీవీసీలను టీడీపీ లేఖ ద్వారా కోరింది.

Last Updated : Oct 29, 2023, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details