ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP MP Kesineni Nani on Women Reservation Bill: 'మహిళల హక్కులకు ఎన్టీఆర్ పునాది.. మహిళా సాధికారత కోసం బాబు పోరాటం..'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2023, 8:42 AM IST

TDP_MP_Kesineni_Nani_on_Women_Reservation_Bill

TDP MP Kesineni Nani on Women Reservation Bill: మహిళా సాధికారతకు, లింగ సమానత్వానికి తెలుగుదేశం కట్టుబడి ఉందని ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తీసుకొచ్చిన ప్రధాని మోదీ, కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. బిల్లుకు టీడీపీ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 1985లోనే వారసత్వపు ఆస్తుల్లో మహిళలకు సమాన హక్కులు కల్పించారని గుర్తు చేశారు. ఆయన చూపిన బాటలోనే మహిళలకు సమాన హక్కులు కల్పిస్తూ 20 ఏళ్ల తర్వాత 2005లో కేంద్రం చట్టం తీసుకొచ్చిందని అన్నారు. మహిళా సాధికారతకు తమ నాయకుడు చంద్రబాబు నిరంతరం పాటుపడుతున్నారని వివరించారు. 1999లోనే శాసనసభాపతిగా ప్రతిభాభారతిని నియమించి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. అయితే ఇవాళ రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు వెళ్లనుండగా.. నిన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్​ సభ ఆమోదం తెలిపింది

ABOUT THE AUTHOR

...view details