Jagan Delhi Tour: వివేకా హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే జగన్ దిల్లీ టూర్: కనకమేడల - జిల్లా వార్తలు
TDP MP Kanakamedala: నీతిఆయోగ్ భేటీలో సీఎం జగన్ రాష్ట్రం గురించి ప్రస్తావించిన అంశాలన్నీ అభూత కల్పనేనని.. తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు. వివేకా హత్య కేసు నిందితులను తప్పించేందుకే.. పదేపదే దిల్లీ పర్యటనలు చేస్తున్నారన్నారు. హత్య కేసులో సీఎం పేరును సీబీఐ ప్రస్తావించినప్పడు దానిపై కనీసం స్పందించకుండా, దాట వేస్తుంటే జగన్ పాత్రను ధ్రువీకరిస్తోందని అన్నారు. నీతిఆయోగ్ భేటీలో సీఎం జగన్ చెప్పిన అంశాలన్నీ కట్టుకథలని ఎద్దేవా చేశారు.
వివేకా హత్య కేసును నుంచి విషయాలను వెలుగులోకి రాకుండా తప్పించుకునేందుకే సీఎం జగన్ దిల్లీ వస్తున్నాడని.. కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు అప్పులు తెచ్చుకొని తద్వారా.. కాలక్షేపం చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే దిల్లీ పర్యటన చేపడుతున్నట్లు కనకమేడల ఆరోపించారు. వివేకా హత్య కేసులో సీఎం జగన్ పాత్ర ఉందని సీబీఐ ఆరోపించిందని.. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకే కేంద్ర హోంమంత్రిని అర్ధరాత్రి కలిసి వెళ్లాడని.. దీన్ని బట్టి చూస్తే.. వివేకా హత్య కేసులో సీఎం జగన్ పాత్ర ఎమిటో అర్థం అవుతుందని కనకమేడల ఆరోపించారు.