ఆంధ్రప్రదేశ్

andhra pradesh

tdp_mlc_fires_on_ycp_land_encroachment

ETV Bharat / videos

TDP MLC fires on YCP land encroachment పులివెందులలో భారీ భూ కుంభకోణం.. ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయడం లేదు: ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి - భూ ఆక్రమణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2023, 4:18 PM IST

TDP MLC fires on YCP land encroachment in Pulivendula : ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. అధికార వైసీపీ నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. అధికారులను మచ్చిక చేసుకుని అమ్ముకొంటున్నారు. ఒకవేళ అధికారులు అడ్డుకునేందుకు యత్నిస్తే.. నకిలీ పత్రాలు సృష్టించి జనానికి కుచ్చుటోపీ పెడుతున్నారు. 

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందుల పట్టణంలో నకిలీ ఎన్​ఓసీలు సృష్టించి వంద కోట్ల రూపాయల విలువైన భూములను అధికార పార్టీ నాయకులు కాజేశారని తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ (TDP MLC) భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. 14 నకిలీ ఎన్​ఓసీ లు సృష్టించి 60 ఎకరాల భూములను వెంచర్లుగా వేశారని ఆయన తెలిపారు. ఆక్రమిత భూములను ప్రజలకు పాట్లుగా విక్రయిస్తున్నారని భూమిరెడ్డి ఆక్షేపించారు. చుక్కల భూములకు ఎన్​ఓసీ (NOC) లు ఇవ్వకుండా కలెక్టర్ తిరస్కరించినా.. అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కయి నకిలీ నిరభ్యంతర పత్రాలను తయారు చేశారని ఆయన మండిపడ్డారు. ఈ అంశంపై ఆర్డీఓ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆక్షేపించారు. రెండు రోజుల్లో అధికారులు చర్యలు తీసుకోకపోతే అన్ని ఆధారాలతో కుంభకోణాన్ని బయటపెడతానని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details