TDP MLC Bhumireddy Ramgopal Reddy family on Illegal Cases: ఎన్ని కేసులు పెట్టినా ఎప్పుడూ టీడీపీలోనే కొనసాగుతాం: రాంగోపాల్ రెడ్డి సతిమణి - Cases against MLC Ramgopal ReddyinPunganurincident
TDP MLC Bhumireddy Ramgopal Reddy family on Illegal Cases: తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి బెదిరించినా.. తాము ఎల్లప్పుడూ తెలుగుదేశం జెండా నీడలోనే కొనసాగుతామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి భార్య ఉమాదేవి, కుమారుడు సాయి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా పులివెందులలోని వారి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పుంగనూరు ఘటనలో పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని ఏ4గా చేర్చడం అన్యాయమని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్‌ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో గెలిచిన కారణంగానే తన భర్తపై అక్రమ కేసు నమోదు చేశారని ఉమాదేవి ఆరోపించారు. తమ ఇంటిపై దాడులు చేశారని ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని అన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయపరంగా ఎదుర్కొంటామని ఉమాదేవి స్పష్టం చేశారు. అక్రమ కేసులు తమకేమి కొత్త కాదని.. తన తండ్రిపై నమోదైన కేసుపై న్యాయస్థానంలో పోరాడతామని రాంగోపాల్ రెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.