TDP MLA Nimmala Ramanaidu on CBN Arrest 2014లో లక్ష కోట్లు.. ఇప్పుడు 3.5 లక్షల కోట్లు! అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ దోచుకున్నాడు - చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 25, 2023, 3:57 PM IST
TDP MLA Nimmala Ramanaidu on CBN Arrest: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్ల రూపాయలను దోచుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదని తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. తనపై ఉన్న అవినీతి మరకలను జగన్ అందరికీ అంటించాలని చూస్తున్నారన్నారు. 2014 ఎన్నికలకు ముందు లక్ష కోట్ల రూపాయలు ఉన్న జగన్ ఆస్తి.. ఇప్పుడు దాదాపు మూడున్నర లక్షల కోట్ల రూపాయలకు చేరిందని నిమ్మల విమర్శించారు. ఈ క్రమంలో జగన్ అవినీతి, అక్రమ సంపాదన, కేసుల వివరాలపై ఆయన తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
"తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.లక్షల కోట్లు దోచుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదు. తనపై ఉన్న అవినీతి మరకలను జగన్ అందరికీ అంటించాలని చూస్తున్నారన్నారు. 2014 ఎన్నికలకు ముందు లక్ష కోట్ల రూపాయలు ఉన్న జగన్ ఆస్తి.. ఇప్పుడు దాదాపు మూడున్నర లక్షల కోట్ల రూపాయలకు చేరింది." - నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే