'టిడ్కో లబ్ధిదారుల ఇంటి అద్దెలు, బ్యాంకు బకాయిలు' - పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే భిక్షాటన - MLA Nimmala Ramanaidu protest in Palakollu
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 12, 2023, 12:28 PM IST
TDP MLA Nimmala Ramanaidu Innovative Protest Against YCP Govt:పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. టిడ్కో గృహాల లబ్ధిదారులకు నాలుగున్నరేళ్లుగా ఇళ్లు ఇవ్వక పోవడం.. పట్టణవాసులకు సూదరంగా గ్రామీణ ప్రాంతంలో పట్టాలు ఇచ్చిన ప్రభుత్వ తీరుపై మరో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి అద్దెలు, బ్యాంకు బకాయిలు కట్టుకోలేని పేదలు, మహిళల కోసం భిక్షాటన చేశారు. పాలకొల్లు పట్టణ మెయిన్ రోడ్లో లబ్ధిదారులైన మహిళలతో కలిసి దుకాణాల వద్దకు వెళ్లి సాయం చేయమంటూ కోరారు.
వర్తకులు తమకు తోచిన సాయం చేసి నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. జగన్ ప్రభుత్వం ఇళ్ల పేరుతో పేదలు, మహిళలను మోసం చేసిందంటూ.. ప్రభుత్వం కళ్లు తెరిచేలా.. ఈ నెల 15వ తేదీన తలపెట్టిన 'పాలకొల్లు చూడు' నిరసన కార్యక్రమానికి లబ్ధిదారులు తరలిరావాలని కార్యక్రమం ప్రారంభించారు. రెండు రోజులుగా వార్డుల్లో పాదయాత్ర చేస్తూ ఎమ్మెల్యే రామానాయుడు నిన్న 10వ వార్డు నుంచి 19వ వార్డు వరకు పర్యటించిన నిమ్మల బెత్లహెంపేటలో నిద్రపోయారు.