ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP_MLA_Nimmala_Ramanaidu_About_Jagananna_Layouts

ETV Bharat / videos

ముంపు లేఅవుట్‌లలో ఇళ్లు కట్టుకుని పేదలు ఎలా నివాసముంటారు?: ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు - Nimmala Ramanaidu on Jagananna Layouts

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2023, 7:00 PM IST

TDP MLA Nimmala Ramanaidu About Jagananna Layouts: జగన్ ప్రభుత్వం ఇచ్చిన ముంపు లేఅవుట్​లలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే 20 నుంచి 30 ఏళ్లు పడుతుందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో పేదలు, మహిళలకు శివదేవుని చిక్కాల గ్రామం నక్కలతిప్పలో ప్రభుత్వం ఇళ్ల స్థలాలుగా ఇచ్చిన 42 ఎకరాల ముంపు భూమిని లబ్ధిదారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ లేఅవుట్​లో రహదారులకు 20 అడుగుల కేటాయించడంతో ఇంటి నిర్మాణాలు చేసుకుంటే నివాసం ఉండే పరిస్థితి ఉండదని క్షేత్రస్థాయిలో కళ్లకు కట్టినట్లు చూపించారు. 

పేదలు, మహిళలకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన దారీ, తెన్నూ లేని లేఅవుట్​లో ఇంటి నిర్మాణం జరుపుకుంటే దుర్భర పరిస్థితి తప్పదని మండిపడ్డారు. 3 వేల మందికి సెంటు పట్టా ఇస్తే.. అందులో సుమారు పది వేల మంది వరకు జీవనం సాగిస్తారని.. ఇరుకైన 12 అడుగుల రహదారిలో ఏ విధంగా రాకపోకలు సాగిస్తారని నిమ్మల ప్రశ్నించారు. గ్రామపంచాయతీ నిబంధనల ప్రకారం లేఅవుట్​లో 33 అడుగుల రహదారి ఉండాల్సి ఉంటే.. ఈ లేఅవుట్​లో 20 అడుగుల రహదారికి అధికారులు ఏ విధంగా అనుమతిచ్చారో చెప్పాలన్నారు. జగన్ ప్రభుత్వంలో మోసపోయిన లబ్ధిదారులంతా ఈ నెల 15వ తేదీన వంట వార్పు నిరసన కార్యక్రమానికి కదలిరావాలని నిమ్మల పిలుపునిచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details