TDP MLA Gottipati Ravikumar Tweet on Rushikonda: రుషికొండపై టీడీపీ ఎమ్మెల్యే ఆసక్తికర ట్వీట్.. జులాయి సినిమాను ఉదహరిస్తూ..! - రుషికొండపై టీడీపీ ఎమ్మెల్యే ట్వీట్
TDP MLA Gottipati Ravikumar Tweet on Rushikonda: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమాల్లో జులాయి ఒకటి. అందులో ప్రతి డైలాగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఆ సినిమాలో సోనుసూద్‌కు కోట శ్రీనివాసరావు రుషికొండ గురించి చెప్తారు. 'రుషికొండ నుంచి భీమిలి వెళ్లే రూట్లో ఓ రోడ్డు కొంచెం మలుపు తిరుగుతుందయ్యా. అమ్మాయి నడుములాగ. కరెక్టుగా అక్కడ పది ఎకరాల బిట్టు మనకు ఉంది. అక్కడ కూర్చుంటే వైజాగ్ మొత్తం మన కాళ్ల కింద ఉన్నట్లు ఉంటుంది.' అని ఓ డైలాగ్ చెప్తారు. గుర్తుందా..? అయితే ఇప్పుడా జులాయి సినిమా గురించి టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా.. జులాయి సినిమాలోని సన్నివేశాన్ని రుషికొండపై తాజా పరిస్థితులకు ఉదహరిస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ వినోదం కోసం తీసిన పలు సన్నివేశాలు కొందరికి లేనిపోని ఆలోచనలను ఇస్తున్నాయని వాపోయారు. సినిమా డైలాగ్‌లను సీరియస్‌గా తీసుకుని వైసీపీ పాలకులు కొండలు కొట్టేశారని ఆరోపించారు. రాబోయే గుంటూరు కారం సినిమాలో దయచేసి ఇలాంటి సన్నివేశాలు పెట్టవద్దంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లేదంటే గుంటూరును కూడా దోచేస్తారంటూ రవి కుమార్ ట్వీట్ చేశారు.