ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP_Leaders_Ready_to_Answer_Police_Notices

ETV Bharat / videos

TDP Leaders Ready to Answer Police Notices: ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నిస్తే పోలీసులకేం సంబంధం..? : టీడీపీ - గన్నవరంలో రోజాపై లోకేశ్ వ్యాఖ్యలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2023, 2:08 PM IST

TDP Leaders Ready to Answer Police Notices: పోలీసులు ఇచ్చిన నోటీసుకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు తెలుగుదేశం సిద్దమవుతుంది. గన్నవరం బహిరంగ సభ నిర్వహణపై యువగళానికి పోలీసులు నిన్న నోటీసులు ఇచ్చారు. గన్నవరం బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి, మంత్రి ఆర్​కే రోజా పరువు తీశారంటూ నోటీసులో పేర్కొన్నారు. తమ నోటీసులకు వివరణ ఇవ్వాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిన ముఖ్యమంత్రిని నిలదీస్తే, పోలీసులకు అది తప్పుగా ఎలా కనిపించి ఉంటుందని టీడీపీ వర్గాలు నిలదీశాయి. టీడీపీ హయాంలో ఉచిత ఇసుక ఇస్తే ఇప్పుడు ఇసుక ధరలు అధికంగా పెరిగి, భవన నిర్మాణ రంగం కుదేలవటానికి ముమ్మాటికీ జగన్ అవినీతే అని స్పష్టం అవుతుందన్న తెలుగుదేశం నేతలు.. ఇదే అంశాన్ని లోకేశ్ ప్రస్తావించటం తప్పు ఎలా అవుతుందని దుయ్యబట్టారు. రాజకీయ పార్టీ సభలో ప్రభుత్వ తప్పిదాలు ప్రశ్నించి, హామీల విస్మరణను విమర్శిస్తే పోలీసులకు సంబంధం ఏమిటని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. 

తల్లిని - చెల్లిని గెంటేసి, బాబాయ్​ని హత్య చేయించిన వారికి పరువు అంటూ ఉంటుందా అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా వైసీపీ నేతలు దోచుకున్న డబ్బు కాపాడుకోవటానికి ముఖ్యమంత్రి బూట్లు నాకుతున్నారంటూ మండిపడ్డారు. నేతల ప్రతీ బూతు మాటకీ ఓట్ల రూపంలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని దేవినేని ఉమా హెచ్చరించారు. యువగళంతో వైసీపీకి భయం పట్టుకుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. 

ABOUT THE AUTHOR

...view details