TDP Leaders Rally in Tadepalligudem: తాడేపల్లిగూడెంలో ఉద్రిక్తతకు దారి తీసిన తెలుగుదేశం నేతల ర్యాలీ - TDP Leaders Rally
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 1, 2023, 10:06 PM IST
TDP Leaders Rally in Tadepalligudem: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో.. తెలుగుదేశం నేతల ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు 10 వేల మందితో భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. నేతలను గృహనిర్భంధం చేసినప్పటికీ చాలా మంది పోలీసుల ఆంక్షల వలయం దాటుకుని బయటకు వచ్చారు. పాదయాత్రకు బయలుదేరిన నిమ్మల రామానాయుడును అరెస్టు చేశారు. దీక్షాశిబిరం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ.. టీడీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకున్నారు. అయినా నాయకులు వెనక్కి తగ్గకుండా పాదయాత్రలో పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా.. సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. మహాపాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి అన్ని రకాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నించారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే నియంత పాలనలో ఉన్నామా అంటూ మండిపడ్డారు.