ఆంధ్రప్రదేశ్

andhra pradesh

tdp_leaders_on_voter_list_in_kadapa

ETV Bharat / videos

డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వారికీ ఓట్లు - కడప కలెక్టర్​కు తెలుగుదేశం నేతల ఫిర్యాదు - టీడీపీ సీనియర్ నేత శ్రీనివాసరెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 7:08 PM IST

TDP Leaders On Voter LIst In Kadapa : కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు ఉన్నాయని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వారు జాబితాలో ఉన్నారని కడప కలెక్టర్ విజయరామరాజును కలిసి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఓటర్ల జాబితాలో బూత్​ల వారీగా తప్పులను ఆధారాలతో సహా కలెక్టర్‌కు అందజేశామని టీడీపీ నేతలు వెల్లడించారు. తమ ఫిర్యాదుపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, ఓటర్ల జాబితాపై మరోసారి పరిశీలన చేయిస్తానని హామీ ఇచ్చారని నేతలు తెలిపారు.

TDP Kadapa Incharge To Collector Office :ఎన్నికల్లో ఎటువంటి తప్పులు దొర్లకూడదని. ఓట్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని తాము ఓటర్​ జాబితాను పరిశీలిస్తున్నామన్నారు. కడప టీడీపీ ఇంఛార్జ్​ మాధవీ రెడ్డి కలెక్టర్​తో మాట్లాడామన్నారు. తప్పులు ఉన్న ఓటర్​ లిస్ట్ వివరాలను కలెక్టర్​కు అందించామన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత శ్రీనివాసరెడ్డి సహా పలువురు టీడీపీ కార్యకర్తలు కలెక్టర్​ను కలిశారు.

ABOUT THE AUTHOR

...view details