TDP Leaders Innovative Protest in Gajuwaka గాజువాకలో చేతికి సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపిన టీడీపీ నేతలు..ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేశారంటూ ఆగ్రహం - గాజువాకలో చేతికి సంకెళ్లు వేసుకుని నిరసన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 26, 2023, 9:12 PM IST
TDP Leaders Innovative Protest in Gajuwaka : సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేశారంటూ.. విశాఖ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యతిరేకిస్తూ గాజువాకలో వినూత్న పద్దతిలో నిరసన చేశారు. ప్రజాస్వామ్యానికి సంకెళ్ల పేరిట టీడీపీ కార్యకర్తలు జైల్లో ఉన్నట్టుగా, సంకెళ్లు వేసుకుని నిరసన తెలియజేశారు. చంద్రబాబు అరెస్టు వ్యతిరేకిస్తూ కనీసం నిరసన చేయనివ్వడం లేదని అందుకు నిదర్శనంగానే చేతికి సంకెళ్లు వేసుకుని, జైలు ఊచలు వెనుక నిల్చుని నిరసన చేశామని పల్లా శ్రీనివాసరావు చెప్పారు.
ఈ నిరసన కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావుతో ఇతర కార్పొరేటర్లు, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు పుచ్ఛా విజయకుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తున్నారని, అందుకు నిరసనగా తమ గొంతు వినిపించే వారిని పోలీసులు విచక్షణ రహితంగా అరెస్టు చేస్తున్నారని పల్లా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలను అక్రమ కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారని పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.