దళితులపై దాడులు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కనిపించడం లేదా?: ఎంఎస్ రాజు - వైసీపీ బస్సు యాత్ర
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 25, 2023, 4:09 PM IST
TDP Leaders Fires on YCP Ministers: ఓ వైపు దళితులపై దాడులు చేస్తూ.. ఊచకోత కోస్తుంటే పట్టని వైసీపీ మంత్రులు.. సామాజిక సాధికార పేరుతో బస్సు యాత్ర (YCP Bus Yatra) చేపట్టడం హాస్యాస్పదమని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆరోపించారు. సామాజిక బస్సు యాత్ర పేరుతో.. జగన్‌ని మరోసారి సీఎం చేయడమే లక్ష్యంగా తిరుగుతున్న ఎస్సీ మంత్రులు, ఎమ్మెల్యేలకు.. దళితులపై జరుగుతున్న దాడులు కనిపించడం లేదా అని.. ప్రశ్నించారు.
ఏలూరులోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన దళిత శంఖారావం సభకు (TDP Dalita Sankharavam Meeting) ముఖ్య అతిథిగా ఎంఎస్ రాజు, మాజీ మంత్రులు జవహర్, పీతల సుజాత పాల్గొన్నారు. ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జనవరి 10వ తేదీన దండయాత్ర మహాసభ నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. దళితులపై జరగుతున్న దారుణాలను ప్రశ్నించడానికే.. ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత శంఖారావ సభలు నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి పీతల సుజాత తెలిపారు.