ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP Leaders Fires On Police In Vijayawada

ETV Bharat / videos

TDP Leaders Fires On Police In Vijayawada టీడీపీ బీసీ విభాగం సైకిల్ ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణ.. ప్రజల హక్కును జగన్ కాలరాస్తున్నడని ఆగ్రహం - వైసీపీ వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2023, 3:38 PM IST

 TDP Leaders Fires On Police In Vijayawada: విజయవాడలో తెలుగుదేశం పార్టీకి చెందిన  బీసీ నేతల(BC leaders)కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొల్లు రవీంద్ర పిలుపుమేరకు వీరంకి వెంకట గురుమూర్తి ఆధ్వర్యంలో చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ బీసీ నేతలు సైకిల్ ర్యాలీ చేపట్టారు. అయితే, ర్యాలీకి  అనుమతి లేదంటూ పోలీసులు సైకిల్ ర్యాలీ(cycle rally)ని అడ్డుకున్నారు. పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ అమల్లో ఉన్నందున అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఎన్నాళ్లు రాష్ట్రంలో పోలీస్ యాక్ట్ అమలు చేస్తారంటూ వీరంకి వెంకట గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 పిరికి జగన్ రెడ్డి ప్రజలు రోడ్డెక్కితే వణుకుతున్నాడని విమర్శించారు. సీఎం జగన్ ఇంతలా ఎందుకు వణికిపోతున్నారని టీడీపీ నేతలు సెటైర్లు వేశారు. ర్యాలీ(rally) చేసే హక్కు కూడా రాష్ట్రంలోని పౌరులకు లేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ రెడ్డి అపహాస్యం చేస్తున్నాడని ఆక్షేపించారు. నిరసన తెలపడం ప్రజల హక్కు అనే విషయం జగన్ రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు. నాడు చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లేయించి నిరసన హక్కు అన్నారు... నేడు శాంతియుతంగా ర్యాలీని అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజల హక్కులతో చెలగాటం ఆడాలనుకుంటే తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details