రాష్ట్రమంతా కరవు తాండవిస్తుంటే సమీక్ష చేసే తీరిక లేదా? వైసీపీ సర్కారు తీరుపై టీడీపీ నేతల మండిపాటు - ఏపీ రాజకీయ వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2023, 5:01 PM IST
|Updated : Nov 6, 2023, 6:56 PM IST
TDP Leaders Fire on YCP Govt: వైసీపీ పాలనలో సాగును సర్వనాశనం చేశారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. రాష్ట్రమంతా కరవు తాండవిస్తుంటే కనీసం సమీక్ష చేసే తీరిక కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించి పరిహారం అందించాల్సిన వ్యవసాయ మంత్రి.. పెద్దగా సమస్యలేమీ లేవన్నట్లు మాట్లాడటం దారుణమన్నారు. అనంతపురం జిల్లాలో ఎండిపోయిన వేరుశనగ పంటను.. తెలుగుదేశం వ్యవసాయ స్టీరింగ్ కమిటీ సభ్యులు పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
"వైసీపీ పాలనలో సాగును సర్వనాశనం చేశారు. రాష్ట్రమంతా కరవు తాండవిస్తుంటే కనీసం సమీక్ష చేసే తీరిక కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించి పరిహారం అందించాల్సిన వ్యవసాయ మంత్రి.. పెద్దగా సమస్యలేమీ లేవన్నట్లు మాట్లాడటం దారుణం." - టీడీపీ నేతలు