ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతల ధర్నా.. - ప్రకాశం జిల్లా లేటెస్ట్ న్యూస్
ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు సోమవారం ధర్నాలకు దిగారు. అసెంబ్లీ సమావేశంలో కొండెపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు దాడి చేసిన నేపథ్యంలో ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఏపీ అసెంబ్లీలో సభ్యులపై చేయిచేసుకునే పరిస్థితి ఉమ్మడి ఏపీ, ఏపీలో ఎప్పుడూ జరగలేదని వారు పేర్కొన్నారు. బాధిత ఎమ్మెల్యే నిరసన మాత్రమే వ్యవహరించారు, అయితే ఆయనపై వైఎస్సార్సీపీ ఇలా దాడి చేయటం దారుణమని టీడీపీ నేతలు రాస్తారోకోలు నిర్వహించారు. కుట్రపూరితంగానే వైఎస్సార్సీపీ ఇలా వ్యవహరించందని ఆరోపిస్తూ ధర్నాలు నిర్వహించారు. ఈ మేరకు టంగుటూరు, కొండెపి, సింగరాయకొండ తదితర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. దళిత ఎమ్మెల్యేపై వైఎస్సార్సీపీ ఇలా దారుణంగా దాడి చేయడం అన్యాయమని వారు పేర్కొన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓడిపోయే సరికి ఓటమిని సహించలేకపోయే ఇలా దారుణంగా వ్యవహరించారని వారు తెలిపారు. దీంతో పాటు వైఎస్సార్సీపీ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని అన్నారు. టంగుటూరులో పోలీసులు ఈ నిరసనను అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
TAGGED:
టీడీపీ నిరసన