చెరువులో నిర్మాణాలు - పట్టించుకోని అధికారులు - thirupathi news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 12:42 PM IST
YSRCP leaders land encroachment in Tirupati:వైఎస్సార్సీపీ నాయకుల భూ అక్రమాలు రోజు రోజుకి మితిమీరుతున్నాయని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. తిరుపతి జిల్లా అన్నమయ్య మార్గంలో పానచెరువు ఆక్రమణకు పాల్పడ్డారని టీడీపీ నేత, కార్పొరేటర్ మునికృష్ణ పేర్కొన్నారు. చెరువును చదును చేసి నిర్మాణాలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదు చేసినా, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు వైఎస్సార్సీపీ నేతలు భూ కబ్జా చేస్తున్నారని కార్పొరేటర్ మునికృష్ణ విమర్శించారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చెరువుల ఆక్రమణలు ఎక్కువయ్యాయని మునికృష్ణ ఆరోపించారు. భూ కబ్జాలో వైఎస్సార్సీపీ చెందిన స్థానిక కార్పొరేటర్‌తో పాటుగా ఎమ్మెల్యే, అతని కుమారుడి హస్తం ఉంది ఆరోపించారు. అధికారులు సైతం వైఎస్సార్సీపీ నేతల కనుసన్నల్లోనే పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో సుమారుగా 2.93 ఎకరాల భూమిని కబ్జా చేశారని, కబ్జా చేసిన భూమిని రిజిస్ర్టేషన్ ఎలా చేశారని ప్రశ్న ప్రశ్నించారు. చెరువులో నిర్మాణాలు సైతం చేపట్టారని ఆరోపించారు. చెరువులో నిర్మాణాలు చేపడుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని మునికృష్ణ ధ్వజమెత్తారు. అధికారులు స్పందించి భు కబ్జాకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే కలెక్టర్‍కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.