మూడు నెలల తర్వాత పార్టీ కార్యాలయానికి చంద్రబాబు - టీడీపీలోకి చేరనున్న వైఎస్సార్సీపీ నేతలు - తొలిసారి పార్టీ కార్యాలయానికి చంద్రబాబు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 14, 2023, 10:04 AM IST
|Updated : Dec 14, 2023, 12:46 PM IST
TDP Leaders And Workers Will Meet Chandrababu In TDP Party Office: తెలుగుదేశం అధినేత చంద్రబాబు మూడు నెలల విరామం తర్వాత తొలిసారి పార్టీ కార్యాలయానికి రావడంతో ఆయనను కలిసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు సమక్షంలో ఇవాళ, రేపు వైఎస్సార్సీపీ శ్రేణులు తెలుగుదేశంలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కదిరి, ఏలూరు, రామచంద్రపురం, తంబళ్లపల్లి, పెదకూరపాడు, తాడికొండ నియోజకవర్గాల నుంచి పార్టీలోకి పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నట్లు వెల్లడించాయి.
నైపుణ్యాభివృద్ధి కేసులో బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు తొలిసారి పార్టీ కార్యాలయానికి రాగా ఆయనను కలిసేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. చంద్రబాబుకు పూలమాలతో పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ నెల 21న ఉదయం చంద్రబాబు విజయవాడలోని గుణదల మేరీమాత ప్రార్థనా మందిరాన్ని సందర్శించి, సాయంత్రం పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.