ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP Leader Yarapathineni Fire on MLA Kasu Mahesh Reddy

ETV Bharat / videos

TDP Leader Yarapathineni Fire on MLA Kasu Mahesh Reddy: నేనే ఎమ్మెల్యే మహేశ్‌​రెడ్డి చేత శ్రీనుకోటి రాయిస్తా: యరపతినేని - యువగళం పాదయాత్రలో మాట్లాడిన యరపతినేని

By

Published : Aug 8, 2023, 10:14 PM IST

TDP Leader Yarapathineni Fire on MLA Kasu Mahesh Reddy: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌ రెడ్డి తన చేత రామకోటి రాయిస్తా అన్నారని.. తానే అతని చేత శ్రీనుకోటి రాయిస్తా అంటూ టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభ కాసు మహేశ్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు.తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పల్నాడులో 17 ఫ్యాక్షన్‌ గ్రామాలు ఉన్నాయని.. వాటినన్నింటినీ సద్దుమణిగించానని చెప్పారు. మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలకు క్షమాభిక్ష పెడతామని యరపతినేని అన్నారు.

"నేను పల్నాడులో పుట్టాను... కాసు మహేశ్‌ రెడ్డి నాతో రామకోటి రాయిస్తా అన్నారు. రామకోటి రాయించలేవు కానీ నీచేత శ్రీనుకోటి రాయిస్తాను. నాకు రక్తపు కూడు వద్దు. కాసు మహేశ్‌ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాడు. తరువాత ఎక్కడికి పోతాడో తెలియదు. మీరు చంపి నేను చంపితే ఎలా? మేము రక్తపు కూడు తినం. మీరు బతకండీ.. మీ పిల్లలను చదివించుకోండి.. నేను వైసీపీ వాళ్లకు చెపుతున్న మేము అధికారంలోకి వచ్చినా మీ జోలికి రాము."- యరపతినేని శ్రీనివాసరావు, టీడీపీ నేత

ABOUT THE AUTHOR

...view details