ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP_Leader_Yanamala_on_Panchayat

ETV Bharat / videos

TDP Leader Yanamala on Panchayat By-Poll Results: "సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేస్తుంది" - తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు యనమల

By

Published : Aug 21, 2023, 10:50 AM IST

TDP Leader Yanamala on Panchayat By-Poll Results: పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాల ద్వారా 2024 ఎన్నికలకు ముందే వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీని రాష్ట్రం నుంచి గెంటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న సంకేతం వెల్లడయ్యిందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తెలిపారు. గెలుపు కోసం దిగజారి రాజకీయాలు చేసిన చరిత్ర వైసీపీదని మండిపడ్డారు. ప్రజలు టీడీపీ పక్షాన నిలబడటాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ అభ్యర్థులకు ఒక్క ఓటు కూడా రాకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక మంత్రులు నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. బుర్రిపాలెంలో 15వందల 26 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గెలవడమే ప్రజల్లో మార్పుకు నిదర్శనమన్నారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా వైసీపీ దుకాణం బంద్ అవడం ఖాయమన్నారు. భవిష్యత్తులో వైసీపీ గెలుపు అనేమాటే వినే పరిస్థితి ఉండదని.. ఆ విషయం మంత్రులు గుర్తించుకోవాలని హితవు పలికారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం, వైసీపీ కార్యాలయాలకు టూ లెట్ బోర్డు పెట్టుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details