Varla on MP family Kidnap: ఎంపీ కుటుంబం కిడ్నాప్‌పై కేంద్ర హోంశాఖ ఎందుకు స్పందించలేదు? : వర్ల రామయ్య - vishaka mp vs Varla Ramaiah
Varla reaction on MP MVV Satyanarayana family kidnap incident: విశాఖలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ జరిగితే, ఇంత వరకూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎందుకు స్పందించలేదనీ.. తెలుగుదేశం నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. సిట్టింగ్ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ జరిగితే లోక్‌సభ సెక్రటేరియట్ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేదనీ ప్రశ్నించారు. కుటుంబ సభ్యుల కిడ్నాప్ బాధలో ఉన్న ఎంపీ, ఎవరి బెదిరింపుల వలన ఈ నెల 17న కోటీ యాభై లక్షలు ఖరీదయ్యే 2 పేజీల ప్రతికా ప్రకటనలు ‘‘సాక్షి’’ పత్రికకు ఇచ్చారని నిలదీశారు. సాక్షి పత్రికకు ఇచ్చిన ప్రకటన నుంచే సీబీఐ దర్యాప్తు చేస్తే ఈ కేసులోని అసలు నిందితులు, పెద్ద తలలు బయటకు వస్తాయని వర్ల అభిప్రాయపడ్డారు.
ఈ కిడ్నప్ అంశంపై స్థానిక పోలీసులు సమర్ధంగా దర్యాఫ్తు చేయలేరని ఆరోపించాడు. ఈ కేసుపై కేంద్రం సీబీఐ చేత దర్యాఫ్తు చేపించాలని డిమాండ్ చేశాడు. ఎంపీ ఫ్యామిలి కిడ్నాప్‌లో పెద్ద కుట్ర కోణం దాగుందని ఆరోపించాడు. భూ కబ్జా చేసే వారి మధ్య జరిగిన ఘర్షణ వల్లే ఈ కిడ్నాప్ జరిగిందని వర్ల రామయ్య పేర్కొన్నాడు. కిడ్నాప్ ఘటనపై పోలీసులు సరైన విధంగా స్పందించలేదని విమర్శించాడు. ఘటనపై ముఖ్యమంత్రి, సీఎంఓ సైతం స్పందించలేదని వర్ల ఎద్దేవా చేశాడు. ఘటన జరిగిన అనంతరం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి మరీ రాష్ట్రంలో ఉండలేనని, తెలంగాణకు వెళ్లిపోతానని చెప్పారన్నారు. స్వంత పార్టీ ఎంపీకే రక్షణ లేదంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని వర్ల రామయ్య విమర్శలు గుప్పించాడు.