Varla Ramaiah on Viveka Murder Case: 'హూ కిల్డ్ బాబాయ్‌పై సీఎం జగన్ సమాధానం చెప్పాలి' - viveka murder case
Varla Ramaiah on Viveka Murder Case: వివేకా హత్య కేసు జరిగిన విధానం, పూర్వాపరాలు మొత్తం సీఎం జగన్ మోహన్ రెడ్డే రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ప్రాసిక్యూషన్‍కు వ్యతిరేకంగా మాట్లాడాలంటే సజ్జల రామకృష్ణా రెడ్డి తన సలహాదారు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ నాయకుడిగానో, న్యాయవాదిగానో ముద్దాయిల తరపున మాట్లాడాలన్నారు. సలహాదారుగా ఉంటూ.. ప్రభుత్వ జీతం తీసుకుంటూ.. అవినాష్ రెడ్డి కోసం సజ్జల పని చేస్తున్నారని వర్ల మండిపడ్డారు. ఈ కేసులో సీబీఐకి ఎందుకు రాష్ట్ర పోలీసులు సహకరించలేదో సీఎం జగన్ సమాధానం చెప్పాలని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు అప్పుడే అయిపోలేదని.. సీఎం జగన్, అతని భార్య భారతిని విచారించకుండా ఎలా దర్యాప్తు అవుతుందని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డికి కాపాడేందుకు సీఎం చాలా సార్లు దిల్లీ వెళ్లారని అన్నారు. వివేకా హత్య కేసు.. సీబీఐకి ఒక ఛాలెంజ్ అని పేర్కొన్నారు. ముద్దాయిల తరపున మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణకు ప్రభుత్వ సలహాదారుగా ఉండే అర్హత లేదని విమర్శించారు.